రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు. శీతాకాల విడిది కోసం వచ్చిన ఆమెకు హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారం లోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు.
తొలుత ఏపీలో ఇవాళ జరిగిన ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. . అనంతరం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు వచ్చారు.
రాష్ట్రపతిని ఆహ్వానించిన వారిలో ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులు ఉన్నారు.
ఈరోజు నుంచి ఈ నెల 21 వరకు సికింద్రబాద్‌లోని బొల్లారంలో ద్రౌపది ముర్ము ఉండనున్నారు. ఈనెల 18న రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.
