ఇందూరు: శ్రీరామ నవమిని పురస్కరించుకొని నగరంలోని హమాల్వాడి సంతోషి మాత ( సాయిబాబా) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శోభాయాత్ర నిర్వహించారు.
అయితే అనుమతి లేదని పోలీసులు డీజే వాహనాన్ని అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా పోలీసులతో మాట్లాడారు.
అయినా వినకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యే నే డీజే వాహనాన్ని నడిపారు. దగ్గరుండి శోభాయాత్రను ముందుకు నడిపించారు.
