HomeTelanganaNizamabadఖిల్లా రామాలయ అభివృద్ధి కి కేంద్ర పథకాలు రూ.10కోట్లతో అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం..అర్బన్ ఎమ్మెల్యే...

ఖిల్లా రామాలయ అభివృద్ధి కి కేంద్ర పథకాలు రూ.10కోట్లతో అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం..అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

ఇందూరు: ఖిల్లా రామాలయ అభివృద్ధికి కేంద్ర పథకాలు అందేలా చూస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో నిర్వహించిన కల్యాణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ…ఆలయ అభివృద్ధి కోసం తాను సంకల్పంతో ఉన్నానని, కేంద్ర సహకారం తీసుకొని 10 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.

ప్రధానంగా ప్రసాద్ స్కీమ్ తో దేశంలోని అనేక ఆలయాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. అలాగే ఖిల్లా రామాలయ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నారు. రామాలయానికి రోప్ వే తెచ్చేందుకు కూడా తనవతు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రామాయణంతో కుటుంబ విలువలు, గౌరవం, భక్తి ప్రాముఖ్యత తెలుస్తుందన్నారు. ప్రధానంగా శ్రీరాముడు ధర్మానికి ప్రతీక…ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు.

యువత ఇప్పటికే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తోందని, ఎంతో సంతోషించాల్సిన విషయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments