జూలై 9ఆదివాసీ హక్కుల పరిరక్షణ ఉద్యమాలకు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు గా నిలబడుతుందని, ఆదివాసీ ల రక్షణ చట్టాలను కాపాడుకోవడం కోసం కల్వకుంట్ల కవితక్క నేతృత్వం లో రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని టీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు,
ఇందిరా పార్క్ లో జరిగిన తుడుందెబ్బ, ఆదివాసీ మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు, అనాదిగా ఆదివాసీ జీవితాలు త్యాగాల కు పరిమితం కావలసి వస్తున్నదని, ఆదివాసీ గిరిజనులకోసం చేయబడ్డ చట్టాలు అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి జీవితాల్లో ఏ వెలుగులు రావడం లేదన్నారు,
ఐదో షెడ్యూల్ ను నిర్వీర్యం చేయాలని చేస్తున్న కుట్రను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు, తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి కవితమ్మ ఆదివాసీ, గిరిజన, చెంచుల జీవితాలు,సంస్కృతి,సాంప్రదాయాలు, హక్కులు పరిరక్షించ బడాలి అని ,ప్రభుత్వాలు అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాటాల రూపంలో,అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశం లో,
అటవీ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించడం ద్వారా పలు విధాలుగా ఆదివాసీ లకు అండగా నిలిచి తన దైన శైలిలో అనేక ప్రయత్నాలు చేశారన్నారు, ఇప్పటికీ 1/70చట్టం అమలులో జాప్యం చేస్తోన్న ప్రభుత్వ యంత్రాంగం తీరు రాజ్యాంగ ఉల్లంఘనకు వస్తుందని హెచ్చరించారు,భవిష్యత్ లో ఆదివాసీ,
గిరిజన, దళిత, బీసీ, మైనార్టీ లతో పాటు ఆర్థికంగా వెనుక బడిన అన్ని వర్గాలకు అండగా నిలబడి పోరాడ డా కవితమ్మ సిద్ధం అవుతున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమం లో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ, లోకిని రాజు , ఉపేందర్,లక్ష్మయ్య,భూమేష్,తదితరులు పాల్గొన్నారు
