బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా నీళ్ల ట్యాంక్ ఎక్కారు.మంగళవారం బసవతారక నగర్ లో గల నీటి ట్యాంకును ఎక్కి నిరసన చేపట్టారు తక్షణమే మంత్రివర్గంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు కల్పించాలని డిమాండ్ చేశారు పార్టీకి విధేయుడిగా మచ్చలేని నేతగా కొనసాగుతున్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు
కాంగ్రెసులో పార్టీలు మారి వచ్చిన వ్యక్తులకు ఇస్తున్న ప్రాధాన్యత పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ను అన్ని నియోజకవర్గాలలో కాపాడిన నాయకులు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు
పార్టీపట్ల ఆయనకున్న విధేయత ఆయన నికార్సైన వ్యక్తిత్వాన్ని గుర్తించి తక్షణమే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు లేనట్లయితే ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాపోయారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులను నీటి ట్యాంకు దిగాలని కోరారు
పోలీసుల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ నాయకులు నిరసన విరమించి నీటి ట్యాంకులు దిగారు ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తలారి నవీన్ భూమేష్ తదితరులు ఉన్నారు.
