ఆర్మూర్ లో ఆదివారం నవరాత్రి ముగింపు వేడుకల్లో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం కోలాహలంగా జరిగింది.
నిమజ్జనం యాత్ర లో భక్తులు డీజే ని ఏర్పాటు చేశారు. అయితేఆదివారం రాత్రి జరిగిన నిమజ్జనం యాత్ర లో డీజే ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్ వుండడంతో ఆ డీజే తిరిగి ఇవ్వడానికి పోలీసులు ససేమిరా అన్నారు. దీనితో ఆగ్రహించిన భక్తులు అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేయలేదు సోమవారం ఉదయం అదే విగ్రహం తో వచ్చి ఏసీపీ ఆఫీస్ ఎదుట ఆందోళన కు దిగారు.
