HomeEditorial Specialముగిసిన దసరా సెలవులు మొదలైన తిరుగు ప్రయాణాలు కిక్కిరిసి పోయిన బస్టాండ్ .....

ముగిసిన దసరా సెలవులు మొదలైన తిరుగు ప్రయాణాలు కిక్కిరిసి పోయిన బస్టాండ్ …..

వారం రోజుల దసరా సెలవులు సోమవారం తో ముగిసాయి. మంగళవారం నుంచి విద్యాసంస్థలు తెరుచు కోనున్నాయి. పండగ సెలవుల కోసం సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణాలకు సిద్ధం అయ్యారు.

దీనితో ప్రయాణికులతో RTC బస్టాండ్ లు కిక్కరిసి పోయాయి. సోమవారం నిజామాబాద్ నగర బస్టాండు వెలది మంది ప్రయాణికులతో కిటకిట లాడింది.

ముఖ్యంగా మారు మూల ప్రాంతాలకు పండగ లకోసం వెళ్లిన వారంతా సోమవారం ఉదయం నుంచే జిల్లా కేంద్రానికి చేరుకుంటుండడంతో గ్రామాల నుంచి వచ్చే బస్సులు సైతం నిండుగా వస్తున్నాయి.

మరో వైపు హైదారాబాద్ నుంచి పండగ కోసం వచ్చిన ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు సోమవారమే తిరుగు ప్రయాణం అవుతున్నారు.

కానీ వేలాదిగా హైదారాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతున్న వారు ఉన్నారు కానీ ఆర్టీసీ అధికారులు రద్దీ కి తగ్గట్టు గా అదనపు సర్వీస్ లను ఏర్పాటు చేయలేక పోయారు దీనితో ప్రయాణికులు బస్సు లకోసం బస్టాండు లోనే గంటల తరబడిగా పాడిగాపులు కాస్తున్నారుఎలాగో అదనపు చార్జీలు ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు అవసరాల మేరకు బస్సు లు సిద్ధం చేయక పోవడం ఫై ప్రయాణికులు మండిపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments