HomeTelanganaNizamabadబిజెపి టిఆర్ఎస్ కుట్రలు బయటపెట్టిన రేవంత్ రెడ్డి …….వాస్తవాలు ప్రజలకు తెలిసాయని భయపడుతున్న ధన్పాల్, రాకేష్...

బిజెపి టిఆర్ఎస్ కుట్రలు బయటపెట్టిన రేవంత్ రెడ్డి …….వాస్తవాలు ప్రజలకు తెలిసాయని భయపడుతున్న ధన్పాల్, రాకేష్ రెడ్డి…….డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

బిఆర్ఎస్ బిజెపి కలిసి చేస్తున్న కుట్రలను సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు వచ్చి బట్టబయలు చేయడంతో ఆపార్టీ ల నేతలకు దిక్కుతోచడం లేదని డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు అయన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు

అబద్ధపు ప్రచారాలు చేస్తూ తామే గెలుస్తామని భ్రమలో ఉన్న బిజెపి నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారని , కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో బీసీ కులగణన గాని, ఎస్సీ వర్గీకరణ గాని, రైతులకు రుణమాఫీ గానీ ,రైతు బోనస్ గాని ,రేషన్ కార్డుల పంపిణీ గానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయం గానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ,గృహ జ్యోతి వంటి పథకలు అమలు చేశామని,యువకులకు స్కిల్ యూనివర్సిటీ తీసుకు వచ్చామని వివరిస్తూనే ఇవన్నీ చేస్తేనే పట్టబద్రులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని వారు అన్నారు

ఆ మాటలకు కంగుతిన్న ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి ఏం మాట్లాడాలో అర్థంకాని స్థితిలో రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు అని అంటున్నారని, కానీ ఒక్కసారి వాళ్లు ఆలోచించాలని రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుతున్నాడు

కానీ బిజెపి నాయకుల లాగా పది సంవత్సరాలుగా ప్రజలకు ఒక పథకాన్ని కూడా అందించకుండా కేవలం మోడీ ముఖాన్ని చూసి ఓట్లు వేయమని అడగడం బిజెపి సిగ్గు మాలినతనానికి నిదర్శనమని ఆయన అన్నారు.

ప్రభుత్వానికి పట్టభద్రులకు సమన్వయం చేసే విధంగా ఉండాలి అంటే నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలవాలని నరేందర్ రెడ్డి గారు ఒకవేళ గెలవలేక పోతే అది ప్రభుత్వానికి పట్టభద్రులకు సమన్వయం లోపించే విధంగా ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దానిని అర్థం చేసుకొని బిజెపి నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్నారని మానాల మోహన్ రెడ్డి అన్నారు.

పట్టభద్రులైన యువకులు అమ్మాయిలు ప్రభుత్వానికి పట్టభద్రులకు అనుసంధానం చేసే విధంగా నరేందర్ రెడ్డి గారికి బ్యాలెట్ పేపర్లో రెండో నెంబర్ లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డి గారిని గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబుద్ బిన్ హందాన్ ,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, బింగి మధుసూదన్, సాయికిరణ్, శివ, సంతోష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments