నీ రాజకీయ సమాధి కట్టడానికి కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నరు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ సమాధి కడతరో తెలుస్తుంది..
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే మళ్ళీ తెలంగాణను ఆంధ్రాలో కలపడమే..కలెక్టర్, డిఎస్ఓ కార్యాలయాలను దిగ్బంధనం చేస్తాం..
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డితెలంగాణకు రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి విమర్శించారు.గురువారం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ లో పుట్టి, టీడీపి పెరిగి కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ సీఎం గా ఉంటూ రేపు బీజేపీలో ఉంటారని ఎద్దేవ చేశారు.
ఆయన తెలంగాణ ప్రొడక్ట్ కాదని అన్నారు.ఇక ప్రతి నిత్యం కేసీఆర్ పై అవాక్కులు, చవాక్కులు మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు.మొన్న జరిగిన వరంగల్ సభ తో రేవంత్ రెడ్డికి మతి పోయిందని ఎద్దేవ చేశారు. కేసీఆర్ కు గోరి కడతామని అంటున్న రేవంత్ రెడ్డికి రాబోయే స్థానిక ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు రాజకీయ సమాధి కడతారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏం పథకాలు అమల్లోకి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్టు,కంటి వెలుగు,గొర్రెల పంపిణీ,చేపల పంపిణీ, దళిత బంధు పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.ఆర్మూర్ సిద్ధుల గుట్ట పై ఒట్టువేసి డిసెంబర్లో చేస్తాం, జనవరిలో రైతు రుణమాఫీ చేస్తామని రైతులను మోసంచేశారని ద్వజమెత్తారు.
అదొక్కటే కాకుండా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలపై ఒట్లూ వేసి ప్రజలను మభ్యపెట్టి కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాది కట్టే సమయం వస్తుందని హెచ్చరించారు.
పాముకు కోరల్లో మాత్రమే విషం ఉంటే రేవంత్ రెడ్డికి ఒళ్ళంతా విషమే ఉందని మండిపడ్డారు. ఆయన పేరు మర్చిపోతే కేసులు నమోదు చేయిస్తారని తెలిపారు.రేవంత్ రెడ్డికి సమాధులు కట్టడం కొత్తేమీ కాదని,ఇక హైదరాబాద్ లో ముసి నది పక్కన ఉన్న ఇళ్లను కూల్చేసి సమాధులు కట్టారని,రాష్ట్రంలో టీడీపీ కి సమాది కట్టాడు అని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు కూల్చేస్తామని నిత్యం రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు.
నువ్వు కూర్చున్న సీఎం కుర్చీ, సెక్రటేరియట్ కేసీఆర్ అన్నవాళ్ళు,అలాగే యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం కేసీఆర్ నిర్మాణం చేశారు వాటిని కుచేస్తావా? అని ప్రశ్నించారు. అసలైన కాంగ్రెస్ నాయకులను తొక్కేసి సీఎం కుర్చీలో కూర్చున్నారని ఆయన పేర్కొన్నారు.
బడేబాయ్ మోడీకి ఇష్టమైన చోటేబాయ్ రేవంత్ రెడ్డి, సీఎం కావడానికి ఆడని అబద్ధం లేదు, చేయని మోసం లేదనీ విమర్శించారు.కలెక్టర్, డిఎస్ఓ కార్యాలయాలను దిగ్బంధనం చేస్తాం..
వారం రోజుల్లోగా పంటల కొనుగోళ్ళు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే పది వేల మంది రైతులతో డీఎస్ వో, కలెక్టర్ కార్యాలయాలను దిగ్బంధనం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా రైతుల కష్టాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతులను పురుగులను చూసినట్టు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. డీఎస్ వో తీరు మారకుంటే రైతుల కోపాగ్నినిని చవిచూడాల్సి ఉంటుందన్నారు.కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులకు ఏ కష్టం రాలేదన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినా ఎలాంటి మార్పు రాలేదన్నారు. అదే కాంగ్రెస్, అదే రాక్షస పాలన అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు మైండ్ బ్లాక్..వరంగల్ సభతో కాంగ్రెస్ నాయకులు మైండ్ బ్లాక్ అయ్యి మాట్లాడుతున్నారని అన్నారు.
నిజామాబాద్ రైతులకు ఆంధ్ర వాళ్ళు వ్యవసాయం నేర్పించారని పిసిసి అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతున్నారని అన్నారు.కల్లు గీయడం కూడా ఆంధ్రోల్లే నేరించరంటారేమో అని ఎద్దేవ చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారేమో అని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
