అత్తమీద కోపం దుత్తమీద తీసినట్లుగా కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో మంత్రి కొండా సురేఖ చేసిన నిందలు సినిమా పరిశ్రమ నే కుదిపేస్తున్నాయి.
కేటీఆర్ తో హామీ తుమీ తేల్చుకోవాల్సింది పోయి నాగార్జున కుటుంబం ను రచ్చకీడ్చడం మే వివాదానికి దారి తీసింది. అసలే మూసి ప్రక్షళన డ్యామేజీ నుంచి వ్యూహాత్మకంగా బయటికి బయటపడుతున్న రేవంత్ సర్కార్ ను రూపేణా మరో అప్రతిష్ట తో ఉక్కిరి బిక్కిరి అవుతుంది.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. చాల కాలం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కటైంది. కొండా సురేఖ మీద దండెత్తుతున్నాయి.
చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, మంచు విష్ణు లాంటి తారలు ఘాటుగానే స్పందించారు. తీవ్ర ప్రతిఘటన తో ఖంగు తిన్న కొండా తన వ్యాఖ్యల ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పి చేతులు దులువుకున్నారు.
అందులోనూ ఆమేమీ ప్రాయచ్చిత్తం వ్యక్తం చేయలేదు.నిజానికి కొండా సురేఖ మీద చాలా నీచమైన స్థాయిలో ట్రోలింగ్ సాగింది… తెలంగాణ రాజకీయాల్లో ఆ క్షుద్ర, సోషల్ మంత్రగాళ్లను ఉసిగొల్పేదెవరో, ఎన్నిరకాల ట్రోల్ బలగాల్ని పోషిస్తున్నారో అందరికీ తెలుసు …
కానీ సురేఖ తీవ్ర మనస్తాపం చెందారు గాంధీ భవన్ వేదికగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది, మీడియా ఎదుట తన ఆవేదనను వెళ్లగక్కింది…బిఆర్ యస్ నుంచి కూడా దిద్దుబాటు మొదలయ్యింది హరీష్ రావు రంగంలోకి వచ్చాడు. ఆమె మీద ట్రోల్స్ ను ఖండించారు.
ట్రోల్ చేసే వారి ఫ్రొఫైల్స్ లో హరీష్ రావు ఫొటో లు ఉన్నాయి అందుకే తనే చేయిస్తున్నాడనే సంకేతాలు జనంలోకి వెళ్తాయని అనుకుని ఖండించాడు…
కానీ కేటీయార్ ఆమాత్రం లైట్ తీసుకున్నాడు అది సిద్దిపేట లో జరిగిన రచ్చ కావడంతో ఆయన దూరంగా ఉన్నారు. అంత వరకు ఓకే కానీ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు అని మంత్రి ని ఎద్దేవా చేశాడు… అంతే సురేఖ రగిలి పోయింది …
దీంతో ఇక ఆమె కేటీయార్ మీద ఈ విమర్శల దాడికి దిగింది…కేటీఆర్ మంత్రిగా వుంటూ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించి, వాళ్లను బెదిరించి, వాడుకుని, డ్రగ్స్ అలవాటు చేయించేవాడనే ఓ తీవ్ర విమర్శ చేసింది…
చివరకు నాగార్జున కుటుంబం ను సైతం ఈ వివాదంలోకి లాగింది. చైతన్య, సమంత విడాకులకు కూడా ఈ కేటీయార్ పోకడే కారణమని ఆరోపించింది… సురేఖకు కడుపు మండితే కేటీయార్ మీద విమర్శ చేస్తే వోకే…
ఆయన మీద ఎలాంటి నీచమైన బాష వాడొచ్చు కానీ … అన్నింటికీ మించి సమంతను బజారుకు లాగడం దేనికి..? అసలే అనేక మానసిక ఒత్తిళ్ల సతమతం అయి ఇప్పుడిపుడే కోలుకుంటున్న సమంత క్యారెక్టర్ ను కించ పర్చే సురేఖ తాజా వ్యాఖ్యల వెనుక ఏ రాజకీయ కారణాలు, వ్యూహాలున్నా సరే, అవేవీ సమర్థనీయం కాదు. ..? పైగా ఓ మహిళా మంత్రి తను…
అందులోనూ సమసమాజం కోసం నక్సల్ బరి పోరు పనిచేసింది కూడా అలాంటి ఆమె ప్రతి మాట ఎంత సెన్సిబుల్‌గా ఉండాలి, ఎంత సెన్సిటివ్ మ్యాటర్ ఇది..? సమంత చెప్పింది అక్షరాలా నిజం… మంచి భాషలో స్పందించింది… మహిళను వస్తువుగా మాత్రమే చూసే ఇండస్ట్రీలో నిలబడటానికి, నిలదొక్కుకోవడానికి ఎంత పోరాటం చేయాలో, ఎంత కష్టమో అందరికీ తెలిసిందే…
కేటీయార్ మీద కోపముంటే, నడుమ ఈమెను బజారులో నిలబెట్టడం ఏమిటి..? తప్పే, ఈ తప్పుకు ఏ కారణాలు చెప్పినా సరే అది సమర్థన కాదు, కాలేదు…నీచమైన స్థాయిలో సాగింది… బట్, ఆమె ఎదో ట్రోల్స్ బారిన పడితే ప్రభుత్వంలో ఉంది…
కదా ఆ ప్రతాపం వారిమీద వారిని పోషిస్తున్న వారిమీద చూపించాలి కదా. ట్రోలర్లను బజారుకీడ్చి శిక్షించలేదా ఈ ప్రభుత్వం..? అంత చేవచచ్చిపోయి ఉందా..ఒకవేళ కేటీయార్‌ను టార్గెట్ చేయాలనుకుంటే తన మీదే ఫోకస్ చేయాలి, పదేళ్ల పాలన లో పాపాలు చేసాడని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిరే కదా ఆక్రందనలు చేసారు. మారి ఏలుబడి లోకి వచ్చి పది మాసాలు అయింది.
ఏమైంది మీ ఆరోపణాలు కేటీఆర్ మీద కొరడా ఎందుకు ఝుళిపించలేక పోతున్నారు. సర్కార్ కు ఎందుకు చేతగాని దద్దమ్మ గా ఉంది. అవేవి చేతగాక పొతే సైలంట్ గా ఉండాలి కదా .
అంతే తప్ప ఎక్కడో తన పని తాను చేసుకునే సమంతల్ని లాగడం ఎందుకు ? కేటీయార్ మరీ అరాచకాలకు పాల్పడి ఉంటే, ఫోన్ ట్యాపింగ్ మీద ఎలాగూ విచారణ సాగుతోంది కదా… తనను ఫిక్స్ చేసిందెక్కడ..? దర్యాప్తు ఎందుకు ఆగిపోయింది..?..
అడుగు గట్టిగా నిలదీయు మీ రేవంత్ సార్ ను ! అదీ చేతకాదు మరీ అలాంటి అప్పుడు ఎందుకు ఈ పౌరుషం ! సామజిక సేవలు వుంటూ ఎప్పుడూ బయటికి రాని అక్కినేని అమల తొలిసారి మీడియా తెర మీదకు వచ్చింది…
బీఆర్ఎస్ వాళ్లే కాదు, తటస్థులు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సురేఖ ధోరణిని ఏకిపారేస్తున్నారు… సోషల్ మీడియా అయితే ఇక చెప్పక్కర్లేదు… చివరకు కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థకులు కూడా..!! అవునూ, ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ స్పందన ఏమిటి..? సురేఖను సమర్థిస్తుందా..? అబ్బే, ప్రజెంట్ రాజకీయాల్లో ఈ బురద మామూలే అని మౌనంగా ఉంటుందా..?!
పోనీ, ఆమె చెబుతున్నది వాజీబే అనుకుంటే కేటీయార్ మీద ఈ కోణంలోనూ విచారణ సాగిస్తుందా ఈ ప్రభుత్వం.నెవ్వరు !! ఈ సర్కార్ తో ఊదు కాలదు పీరు లెవ్వదు. జస్ట్ ఆలా మూసి నిర్వాహకులలాంటి పేద ప్రజలను మాత్రం రాచి రంపాన పెడుతుంది.
