ఎన్ కౌంటర్ లో రియాజ్ హతం అయినట్లు సమాచారం. ఆదివారం ప్రాణాలకు తెగించి పట్టుకున్న రియాజ్ ను చికిత్స కోసం ఆసుపత్రి కి తరలించగా సోమవారం మరోసారి పోలీసుల మీద దాడి చేసే క్రమంలో పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపగా రియాజ్ మృతి చెందాడు మరోసారి పోలీసుల మీదమరోసారి కత్తి తో దాడి చేయడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడం తో రియాజ్ మృతి చెందిన నట్లుగా సమాచారం. ఆదివారం మధ్యాహ్నమే సారంగాపూర్ లో లారీ క్యాబిన్ లో దాక్కొని పారిపోతుండగా అడ్డుకున్న యువకుడు అసిఫ్ ను కత్తి తో దాడి చేస్తే చేయి తెగి పోయింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. అక్కడి నుంచి స్టేషన్ కు తరలిస్తున్న క్రమం లోనే మరోసారి తప్పించుకోవడానికి కత్తి తో దాడి చేసాడు .మృతుడు రియాజ్ కోసం గత రాత్రి 9 గంటల నుంచి నిద్రాహారాలు మని పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. రియాజ్ ను దొంగతనం కేసులో విచారణ కోసం తీసుకెళ్తుండగా శుక్ర వారం నిజామాబాద్ నగరం లో వినాయక్ నగర్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి పారిపోయాడు ……//// మరోసారి దాడికి తెగబడిన రియాజ్/// …..సారంగాపూర్ శివారు లోనే ఓ లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తి తో దాడికి తెగబడ్డాడు. రియాజ్ పారిపోతుండగా బైకు మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటాడారు. పెట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను పురమాయించారు ఈ క్రమంలో నెహ్రు నగర్ కు చెందిన అసిఫ్ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లగా తన వద్ద ఉన్న కత్తి తో దాడి చెయ్యడంతో ఎడమ చెయ్యి తెగింది.ఈ లోపు కానిస్టేబుళ్లు వేగంగా వచ్చి రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు.
