నిజామాబాద్ నగరంలో ని దేవీ టాకీస్ సమీపంలో ఓ ఇంట్లో శుక్రవారం పట్టపగలే దొంగతనం జరిగింది.
దేవి టాకీస్ బిడ్జ్ పక్కనే ఉండే ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్ ఇంట్లో చొరబడ్డ గుర్తు తెలియని దొంగలు బీరువా లో ఉన్న నాలుగు లక్షల నగదు ను ఎత్తుకెళ్లారు. కొత్త ఇంటి నిర్మాణం కోసం నగదు ఇంట్లో భద్ర పరుచుకున్నారు.
శ్రీనివాస్ భార్య కూడా అంగన్వాడీ టీచర్ ఇంట్లో తల్లి మాత్రమే ఉన్నారు. ఆమె బయట ఉన్న టైమ్ లో ఈ ఘటన జరిగింది.
ఇంట్లో బంగారు ఆభరణాలు సేఫ్ గానే ఉన్న కేవలం నగదు మాత్రమే చోరీ కావడంతో తెల్సిన వారే చేసారని అనుమానిస్తున్నారు. బాధితుల పిర్యాదు మేరకు నాల్గో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు