నిజామాబాద్ నగరంలోని వ్యక్తినీ దారుణంగా హత్య చేసిన హంతకున్ని అదుపులోకి తీసుకున్నట్లు నాలుగవ టౌన్ పోలీసులు తెలిపారు.
ఈ మేరకు సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం. బుధవారం వినాయక నగర్ లోనీ ఆనంద్ బిహారీ పాండే వంశీ వినాయక లిక్కర్ మార్ట్ యందు మద్యం సేవిస్తూ,మద్యం మత్తులో సాయి కుమార్ అనే వ్యక్తితో జరిగిన జగడలో మృతుడిని సాయి కుమార్ గొంతు పట్టి వెనుకకు నెట్టి వేయగా ఆనంద్ కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అదే తనువుగా పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకొని ముఖము మీద ఎత్తివేయగా తీవ్ర గాయం తో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
నిందితుని వివరాల పై పోలీసులు ఆరా తీయగా విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం నగరం లోని అమ్మ వెంచర్ దగ్గర ఒక డైరీ ఫార్మ్ వద్ద పట్టుకొని విచారించగా నేరము ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు నిందుతుడు సాయి కుమార్ ను అరెస్టు చేసి రిమండ్ కు తరలించినట్లు సీఐ నరహరి తెలిపారు.కేసును చేదించడంలో 4వ పట్టణ ఎస్ హెచ్ ఓ పాండేరావు, ఏ ఎస్ ఐ సాయిలు, సిబ్బంది మనోజ్, అనిల్, బాలాజీ, భూరాజ్, సంగేస్, నారాయణ, రవి రమేష్ ,రాకేష్ లు పాల్గొన్నారు.
