ఏసీబీ చరిత్ర లోనే అత్యంత నగదు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంచార్జ్ రెవెన్యూ అధికారి హోదాలో పనిచేస్తున్న నరేందర్ ఇంట్లో లభ్యం అయింది. గతంలో ఓ తహశీల్ధార్ ఇంట్లో రెండు కోట్ల నగదదు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయింది. నాలుగు కౌంటింగ్ మిషన్ లతో నగదు ను లెక్కించాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం ఏసీబీ మెరుపు దాడి చేసి రూ2 ,93 కోట్ల నగదు ను స్వాధీనం చేసుకున్నారు అలాగే బ్యాంకు లో మరో కోటి రూపాయాల ను గుర్తించారుఅలాగే 50 లక్షల రూపాయల విలువైన బంగారుఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు .
వినాయక్ నగర్ లో అశోక టవర్ లోని ఆయన నివాసం కు తెల్లవారు జామున చేరుకున్న ఏసీబీ అధికారులు ఇంట్లో సోదాలు చేసారు. ఎక కాలం లో నాలుగు చోట్ల ఇలాగే సోదాలు జరిపారు. నరేందర్ ఇంట్లో నగదు నిల్వలు చూసి ఏసీబీ అధికారులు షాక్ తిన్నారు.
కట్టలుగా నగదు ఉండడంతో వాటిని లెక్కించడానికి అప్పటికప్పుడు కౌంటింగ్ మిషన్ లను తెప్పించారు. జిల్లా ఏసీబీ .చరిత్రలోనే ఇంత నగదు ఎప్పుడు దొరకలేదని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.
నగదు ఏ మేరకు దొరికిందనే అధికారులు బయటికి పొక్కనీయడం లేదు. కానీ కోటి రూపాయలకు ఫై గానే ఉండచ్చని అధికారులు ఓ అంచనాగా చెప్తున్నారు. మరో వైపు అంతకు మించి ఆస్తుల తాలూకు పత్రాలు సైతం లభ్యం అయ్యాయి.
ఎక్కవగా బైపాస్ రోడ్ లోని స్థలాల పత్రాలే ఉన్నాయని సమాచారం. ఆయన అత్తవారి ఇల్లుండే నిర్మల్ తో పాటు సోదరుడు తో పాటు మరో ఇద్దరు ఇండ్లలో ఏసీబీ సోదాలు చేసింది.
సుదీర్ఘ కాలంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే పనిచేస్తున్న నరేందర్ ప్రజాప్రతినిధులు అధికారులతో సన్నిహితంగా వివాదాలకు దూరంగా వుంటారు. కానీ మున్సిపల్ కార్యాలయం లో కీలకమైన రెవెన్యూ విభాగం లో పాతుక్కపోయి ఉన్నారు. గతంలో ఓ సారి సస్పెండ్ కూడా అయ్యారు.
నరేందర్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ కి గత నెలరోజుల క్రితమే పిర్యాదు రావడంతో ఈ మేరకు కేసు నమోదు అయింది.