గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.సీఐ దిలీప్ మాట్లాడుతూ..
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని ఖిల్లా రోడ్డు చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న షేక్ అబ్దుల్ సమద్ ను విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.
అతని వద్ద నుంచి 455 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడులు ఎస్ఐ మల్లేష్,షబిరుద్దీన్, ప్రభాకర్, సంజయ్,దరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.