రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మాక్లూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మాక్లూర్ ఏఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.
మాక్లూర్ గ్రామానికి చెందిన శ్రీరామ శ్రీకాంత్(26). ఈ నెల 4న స్నేహితుడైన పవన్ లు ఇద్దరు మాక్లూర్ నందు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ఎదురుగా అతి వేగంతో వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇరువురిని నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీరామ శ్రీకాంత్ ను హైదరాబాద్ లోని వెల్ నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ గంగాధర్ పేర్కొన్నారు.