ఒకరి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సర్వేయర్ తో పటు సహాయకుడి ని పట్టుకున్నారు ఇద్దరు అయ్యప్ప మాల ధారణలో ఉండడం గమనార్హం.
పార్క్ స్థలం ను కబ్జా చేసి నిర్మించిన కాంప్లెక్స్ జోలికి రావద్దంటే మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యలయంలో భూముల సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న కల్వ కిరణ్ కొత్తగా నిర్మించిన షాపు పార్క్ ల్యాండ్ లో ఉందంటూ యజమానిని బెదిరించాడు.
మూడు లక్షల రుపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. చివరికి రెండు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కానీ బాధితుడు ఎసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
మంగళవారం బోయిన్ పల్లి బస్టాప్ వద్ద లక్ష రుపాయల నగదును చైన్ మెన్ భాస్కర్ తో పాటు సర్వేయర్ కిరణ్ లకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
సర్వేయర్ కిరణ్ నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తి గతంలో ఆయన నిజామాబాద్ మాక్లూర్ నందిపేట్ డిచ్ పల్లి లో పనిచేశాడు భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు చివరికి ఏసీబీ టార్గెట్ లో పడినట్లుగా అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం తో నిజామాబాద్ జిల్లాను వదిలేసి హైదరాబాద్ వచ్చాడు
