Saturday, May 2, 2026
HomeCRIMEప్రొపెసర్ ను నమ్మించి మోసం చేసారు ....నకిలీ పత్రాలతో భూమి అంటగట్టే యత్నం

ప్రొపెసర్ ను నమ్మించి మోసం చేసారు ….నకిలీ పత్రాలతో భూమి అంటగట్టే యత్నం

నకిలీ పత్రాలతో వ్యవసాయ భూమి ని యూనివర్సిటీ ప్రొపెసర్ కు అంటగట్టే యత్నం చేసింది ఓ ముఠా బాధితుడి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసుల నిందితులను అరెస్టు చేశారు.

నాలుగో టౌన్ సీఐ సతీష్ వివరాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ లో ప్రొపెసర్ గా పనిచేస్తున్న కనకయ్య భూమి కావాలని బొర్గం కు చెందిన సాయిలు డ్యాకుమెంట్ రైటర్ నబీ బండి రవి లను సంప్రదించారు.

ఈ మేరకు ఓ ఎకరం భూమి వుందని నమ్మబలికి కనకయ్య నుంచి రూ 46.08 లక్షలు తీసుకొని నకిలీ పత్రాలతో ఆ భూమి కనకయ్య పేరున బదలాయించారు. కానీ విషయం తెల్సి నిందితులను కనకయ్య నిలదీశారు.

కానీ డబ్బులు వాపస్ ఇచ్చే విషయంలో చేతులెత్తేశారు దీనితో కనకయ్య పోలీసులకు పిర్యాదు చేసారు.నిందితులు సాయిలు నబీ లను అరెస్టు చేయగా బండి రవి పరారీ లో ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!