HomeCRIMEఇసుక మాఫియాబారి తెగింపు విలేకరిపై దాడి దళిత విలేఖరి చందు పై దాడపోలీస్ స్టేషన్...

ఇసుక మాఫియాబారి తెగింపు విలేకరిపై దాడి దళిత విలేఖరి చందు పై దాడపోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితుడు

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఇసుక మాఫియా బారి తెగించింది.సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో అనగా శనివారం నాడు పొతంగల్ కోడిచెర్ల ఇతర మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి రాత్రిపూట ట్రాక్టర్లలో తగలపల్లి గ్రామం మీదుగా కోటయ్య క్యాంపు మీదుగా వర్ణికి వెళుతున్న ఇస్కట్రాక్టర్ యొక్క విజువల్స్ వార్తను సేకరిస్తున్న దళిత విలేకరి చందు మీద ఇసుక మాఫియా దారులు ఫోన్లు గుంజుకొని, ఐడి కార్డులు గుంచుకొని దాడులు చేయడం విడ్డూరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా పొతంగల్ వర్ని ఎమ్మార్వోలకు ఫోన్ చేసినా స్పందించలేదని వర్ణి ఎస్సై కి ఫోన్ చేయటం జరిగిందని ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ వెళ్తున్నట్టు విలేకరి చందు తెలిపారు.

సదురు ఇసుక మాఫియా దారులు గతంలో కూడా విలేకరులపై దాడులు చేయడం జరిగిందని ప్రస్తుతం కూడా విలేకరులపై దాడులు చేస్తున్నారని ఒక దళిత విలేకరి పై దాడులు చేయడం చర్చనీయంశంగా మారింది.

నాయకులు అండదండలతో, నాయకుల అవతారం ఎత్తిన ఇసుక మాఫియాదారులు జోరుగా ఇసుక మాఫియా చేస్తూ, ప్రభుత్వ ఆదానికి గండి కొట్టడమే కాకుండా, వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments