HomeCRIMEఅంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్- .... పోలీస్ కమీషనర్ వెల్లడి

అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్- …. పోలీస్ కమీషనర్ వెల్లడి

అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దోపిడీ ముఠాని పట్టుకొని 40 కిలోల కాపర్ కాయిల్స్. రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15 న ఇందల్ వాయి లో ఈ ముఠా ను పట్టుకున్నారు

ఈ ముఠా గత సంవత్సరం కాలం నుండి నిజామాబాద్ జిల్లా లోని, ఇందలవాయి, ధర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, ముగ్పాల్, బోధన్ టౌన్, బోధన్ రూరల్, నవీపేట్, వర్ని, మండలాల్లో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసంచేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగలించారు

ఈ ముఠా లోని ఏడుగురు సభ్యులలో ఐదుగురిని నిన్న అరెస్టు చేయడం జరిగింది మరియు అట్టి దొంగలించిన కాపర్ కాయిల్స్ ను కొన్న ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు నిందితులు నిజామాబాద్ జిల్లా లోని 101 ట్రాన్స్ ఫార్మర్ లను పగులగొట్టి అందులో వున్న కాపర్ కాయిల్స్ ను దొంగతనలకు పాల్పడగా 44 కేసులు నమోదు అయ్యాయి

నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకట రెడ్డి ఆద్వర్యంలో స్పెషల్ టీం లనుఏర్పాటు చేసి ఈ నెల 15.న ఇందలవాయి మండల పరిధిలో గన్నారం వద్ద వాహనాలను తనికి చేస్తుండగా అనుమానం వచ్చి నిందితులను పట్టు కొని విచారించడంతో ఈ ముఠా గుట్టు వెల్లడైందని కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు

మహారాష్ట్ర రాష్ట్రం లోని అహ్మద్ నగర్ కు చెందిన సుధాకర్ , ఉత్తర్ ప్రదేశ్ లోని అమిన్ నగర్ కు చెందిన హర్బిర్ శర్మ ఏపీ లోని గుంటూర్ జిల్లా బ్రాడీ పేట్ కు చెందిన అలీ అహ్మద్, ప్రకాశం జిల్లా దర్శి కి చెందిన వెంకటేశ్వర్లు , మహబూబ్ నగర్ జిల్లా పెద్దాపూర్ కు చెందిన శానం పల్లి రవీందర్ కర్ణాటక లోని యాదగిరి జిల్లా ఇండ్లూర్ కు చెందిన లింగప్ప( ప్రస్తుతం మనోరహాబాద్,లో ఉన్నాడు ) సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ కు చెందిన గాజుల శ్రీశైలం ( ప్రస్తుతం మేడ్చల్) హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన మహ్మద్ హైదర్ లను అరెస్ట్ చెయ్యగా అనిల్ వలి లు పరారీ లో ఉన్నారని సీపీ చెప్పారు

ఇట్టి కేసు లకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకొని వారిని విచారించిన అనంతరం వారి వద్ద నుంచి 40 కేజీల కాపర్ కాయిల్స్, 5 లక్షల 50 వేల నగదు స్వాదినం చేసుకొని వారిని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరుపర్చనున్నామన్నారు .

ఈ ముఠా పట్టుకోవడంలో ఏసీపీ రాజ వెంకట రెడ్డి నిజామాబాదు గారి అద్వర్యంలో ముఖ్య పాత్ర వహించిన డిచ్ పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్, డిచ్ పల్లి ఎస్సై షరీఫ్, జక్రాన్ పల్లి ఎస్సై మహేష్, మరియు సిబ్బంది, కిరణ్ గౌడ్ , ప్రశాంత్ సందీప్ , కిషోర్ కుమార్ , సుజిత్ , నవీన్ సర్ధార్ లను సీపీ సాయి చైతన్య అభినంధించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments