చత్తీస్గడ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది, సూక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది
ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం…తెలిసిన వివరాలు ప్రకారం…. చింత గుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కరిగుండం అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి, ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు మరోవైపు సంఘటన స్థలం నుంచి ఆయుధాలు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
