తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలల స్కాలర్ షిప్స్ విడుదల చేయాలనీ రాష్ట్ర, జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ కాలేజీ లో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సూర్య నారాయణ మాట్లాడుతూ.
గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలో స్కాలర్ షిప్స్ విడుదల కావడం లేదని కళాశాల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కనీసం కళాశాల అధ్యాపకులకు, సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితిలో కళాశాల యాజమాన్యాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాబోయే రోజులలో స్కాలర్ షిప్స్ విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.
లేదంటే కళాశాల బంద్ కు పిలుపు కు ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రయివేట్ కళాశాలల జనరల్ సెక్రటరీ Y. రామకృష్ణ, టియుపీసిఏంఏ అధ్యక్షుడు అంబోజీ హరి ప్రసాద్,జనరల్ సెక్రటరీ ఈగ సంజీవ్ రెడ్డి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రయివేట్ డిగ్రీ కళాశాల యజమానులు పాల్గోన్నారు.