తుర్తి గ్రామానికి చెందిన మునిగే చిన్న లింబన్న అలియాస్ కత్తి అను వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఎస్సీ కులం కుందా చిన్న సాయన్న అనే వ్యక్తిపై పొలం వద్ద దాడికి దిగి డ్రిప్ ఇరిగేషన్ పైపులను తగలబెట్టగా జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి తను,తన భార్య మరియు గ్రామస్తులతో పాటు వెళ్లి మునిగే చిన్న లింబన్నను ప్రశ్నించగా
కులం పేరుతో తిడుతూ, బూతులతో దూషించిన సమాజం ముందు చులకన తనను తన కులాన్ని చులకన చేసి, తనని చంపేస్తానని బెదిరించగా, కుందా చిన్న సాయన్న తన భార్యతో పాటు వెళ్లి 25/05/2022 రోజున ఏర్గెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎటువంటి చర్యలు లేకపోగా కోర్టును ఆశ్రయించి ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయగా కేసు విచారణ చేపట్టి ఈరోజు నిందితుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 4700 రూపాయల జరిమానా విధించడం జరిగింది. బాధితుల తరఫున పిపి బంటు వసంత్ వాదించారు.