రాష్ట్ర బడ్జెట్ లో నిజామాబాద్ జిల్లా కు తీవ్ర అన్యాయం జరిగిందనీ బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచరి విమర్శించాడు.
ఈ మేరకు శుక్రవారం నగరం లోని నిఖిల్ సాయి చౌరస్తా లో బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచరి ఆద్వర్యంలో నిరసన చెప్పటి రాష్ట్ర ప్రభుత్యం దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. గురువారం కేటాయించిన రాష్ట్ర బడ్జెట్ లో నిజామాబాద్ జిల్లా కు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం జరిగిందనీ విమర్శించారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక సమయంలో పేర్కొన్న విధంగా జిల్లా వరప్రదాయని అయిన నిజాం చెక్కర కర్మాగారానికి ఎంత కేటాయించారని ప్రశ్నించారు.
అలాగే నిజామాబాద్ జిల్లా పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు,అలాగే బోధన్,ఆర్మూర్,బాల్కొండ నియోగకవర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డా అని ఎద్దేవా చేశారు.
ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన వలస కార్మికులకు, ఆ కుటుంబానికి తీవ్ర అన్యాయం మిగిలించిందనీ దుయ్యబట్టారు.
ఎంతో మంది గల్ఫ్ ఏజెంట్ లా చేతుల్లో మోసపోయి, ఎందరో గల్ఫ్ బాధితులు మరణించి వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు