కొన్ని రోజులుగా నిమ్స్‌లో ప్రాణాలతో పోరాడుతున్న ఆమె ఇవాళ మృతి చెందింది. కొమురం భీం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శైలజ కు ఈ నెల 3న ఫుడ్ పాయిజన్ అయింది.
స్కూల్‌లో భోజనం చేసిన విద్యార్థినులు అస్వస్థతగు గురయ్యారు. వీరిలో మహాలక్ష్మి, జ్యోతి, శైలజను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది.
ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ ఇవాళ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
