HomeCRIMEఅతివకు అండగా షి టీం.. ఆకతాయిల వేధింపుల పై ప్రత్యేక దృష్టి సారింపు...పోలీస్ కమిషనర్ సాయి...

అతివకు అండగా షి టీం.. ఆకతాయిల వేధింపుల పై ప్రత్యేక దృష్టి సారింపు…పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హితవు..

ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాదు షి టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

నిజామాబాదు జిల్లాలో మహిళలు , చిన్నారుల భద్రతకై , రక్షణకై నిజామాబాదు జిల్లా షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల రక్షణకై విధులను నిర్వర్తిస్తుందని , ఆయన అన్నారు.

దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాలలో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధించిన సందర్భాలలో రెడ్ హ్యాండెడ్ గా ఈ నెలలో 19 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

షీ టీం బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించిందని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా నిజామాబాదు షీ టీం బృందాలు యువతులకు , విద్యార్థిని విద్యార్థులకు , పని స్థలాలలో మహిళలకు ప్రత్యేకంగా 26 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరచడం జరుగుతుందనీ అన్నారు.

ఈ సందర్భంగా సెప్టెంబర్ నెలలో షీ టీం బృందాల ద్వారా 11 ఈ పెట్టీ కేసుల నమోదు చేయడం జరిగిందని తెలిపారు. షీ టీం బృందాలు గత నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా 80 హాట్స్పాట్ల లో తనిఖీ చేయడం జరిగింది.

పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. షి టీం బృందం సభ్యులు చాకచక్యంగా వ్యవహరిస్తూ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక బృందంచే మహిళలకు రక్షణగా , మహిళలు వేధింపులకు గురికాకుండా అడ్డుపడుతూ ఆకతాయిల పట్ల చట్టపరంగా వ్యవహరిస్తూ ఉందని తెలిపారు.

07 కౌన్సిలింగ్ ల ద్వారా కేసులలో పరిష్కారం చూపబడింది అని తెలిపారు. ఆపత్కాల సమయంలో నిజామాబాద్ షి టీం బృందాల ను సంప్రదించాలంటే 8712659795 నంబర్కు ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు.

26 గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించి మహిళల పట్ల జరిగే నేరాలపై , చైల్డ్ మ్యారేజ్ , సైబర్ నేరాలపై , సోషల్ మీడియా నేరాలపై , చిన్నారులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై అవగాహనలు కల్పించి చైతన్యపరచడం జరిగిందని తెలియజేశారు.

ఈ నెలలో మహిళల సమస్యలతో దాదాపు 07 మొబైల్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు వారికి తగిన సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు.

షీ టీం బృంద సభ్యులు మహిళా ఆర్ఎస్ఐ శ్రవంతి , హెడ్ కానిస్టేబుల్లు సుమతి , ఆశయ్యా , కానిస్టేబుల్ లు విగ్నేష్ , శ్రీకాంత్ , నాగరాజు , రేఖా రాణి , హరిత రాణి , రాధిక, మహిళా సిబ్బంది షీ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.మహిళలకు , చిన్నారులకు రక్షణగా నిజామాబాదు పోలీస్ వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments