నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్‌పై కాషాయ జెండా ఎగురవేయబోతున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలతో పనిచేయాలన్నారు.శనివారంబిజెపి నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ మండల కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సంస్థల ఎన్నికల గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విజయానికి కృషి చేయాల్సిన విధానాలపై ఆయన కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. మన వార్డులో, మన గ్రామంలో, మన మండలంలో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మన పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులుగా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ‘6 గ్యారంటీ’లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, కేవలం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరి పట్ల ప్రజలు, మహిళలు, రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారని, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వారంతా సిద్ధంగా ఉన్నారనీ వెల్లడించారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాము మద్దతుగా ఉండాలనే విశ్వాసంతో ప్రజలందరూ ఉన్నారని, అందుకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ గెలిపించాలని కోరుకుంటున్నారు.
ఈ యొక్క సమావేశంలో పద్మరెడ్డి,జగన్ రెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, రవి,గోపి,బిలోజి నాయక్, ఆనంద్, సందీప్,తదితరులు పాల్గొన్నారు.
