మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల పక్రియపూర్తీ అయ్యాక రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఫై ఏఐసీసీ కసరత్తులు మొదలు పెట్టింది. కార్తీక మాసం పూర్తిఅయ్యేలోగా మంత్రి వర్గ విస్తరణకు అనుమతి ఇవ్వాలని రేవంత్ ఢిల్లీ పెద్దలను ఒత్తిడి చేస్తున్నారు.
ఈ నెల 30 తో కార్తీక మాసం పూర్తీ అవుతుంది. ఆలోపే విస్తరణ కు అనుకూలంగా చెప్తున్నారు. 26 లేదంటే 27 రోజుల్లో విస్తరణ కు బలమైన రోజులుగా ఆయన ప్రస్తావించారని సమాచారం.
రెండు రాష్ట్ర ల ఎన్నికలు అయ్యాక విస్తరణ చెయ్యాలని అధిష్టానం రేవంత్ కు ఇదివరకే సంకేతాలు ఇచ్చింది.అందుకే ఆయన ఒకరిద్దరు ఆశావహులకు సైతం ఈనెల ఖారు వరకు అందుబాటులోనే వుండాలని చెప్పారట.
సదురు ఇద్దరు నేతలు సైతం తమ సన్నిహితులైన ఒకరిద్దరికి లీక్ చేశారు. మరో నేత ఏకంగా తనకు పాలనా శాఖ ఇవ్వబోతున్నారని కూడా చెప్పడమే కాదు తన పేషీ లో ఎవరెవరు వుండాలో కూడా అరా తీస్తున్నారు. దీనితో ఈసారి తమ నేత మంత్రి అవ్వడం ఖాయమనే సంబరం సన్నిహితుల్లో కనిపిస్తుంది.
రేవంత్ క్యాబినెట్ లో ఆరు స్థానాలే ఖాళీగా ఉన్నాయి కానీ దాదాపు డజన్ మంది నేతలు రేసులో ఉన్నారు . ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు లాబియింగ్ చేస్తున్నారు .వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేసేందుకు ఆ నేతలంతా రెడీ అయ్యారు.
సామజిక సమీకరణాలు ఎలా ఉన్నా కేబినెట్‌లో ప్రాతినిధ్యంలేని ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ఈసారి ప్రాతినిధ్యం ఉండేలా అధిష్టానం ప్లాన్ చేస్తుంది .
సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు రెడ్లు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు .
ఏడాది పాలన ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసిన రేవంత్ రెడ్డి ఆలోపే క్యాబినెట్ విస్తరణ ను సైతం కొలిక్కి తెచ్చేలా అధిష్టానపెద్దల వద్ద లాబీయింగ్ చేస్తున్నారు.
