దేశవ్యాప్తంగా కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల ఆర్థిక పురోగతిలో గణనీయంగా మార్పు వచ్చిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు వారు కలలుకనే ఫోర్ వీలర్ వాహనాలపై జిఎస్టి విధానం వల్ల సుమారు లక్ష రూపాయల వరకు తగ్గింపు ధర వచ్చిందని ఇందుకు సాధారణ మధ్య కుటుంబంలో ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మూడో స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. అందుకని నిత్యవసర సరుకులు తగ్గింపు తో దసరా, దీపావళి పండగలు ఎంతో సంతోషంగా జరుపుకున్నారని ఆయన అన్నారు.
