అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టు రట్టును నిజామాబాద్ ప్రోహిబిషనల్ అండ్ ఎక్సైజ్ అధికారులు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన ఇర్ఫాన్ ఖాన్, మహమ్మద్ యునస్,లు బైపాస్ రోడ్డు పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లోగల కృష్ణ మందిరం నుండి బైపాస్ వెళ్లే రోడ్డు మార్గంలో గల నిర్ కరి సత్సంగ్ భవన్ ఎదురుగా గల కాలి స్థలంలో కొందరు వక్తులు ఎండు గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరుగున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం అందించారు.
అందుకు తనఖీలు నిర్వహించగా, ఇద్దరు వస్తులు పట్టుబడ్డారనీ పేర్కొన్నారు. వారిద్దరి వద్ద నుంచి 6.103 కిలో లా ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. రవాణా కొరకు ఉపయోగించినా, ఇరువురి వద్ద వాహనాలను TVS XL, Honda Activa rendu ద్వి చక్ర వాహనాలను. పట్టుకొని సీజ్ చేసినట్లు వెల్లడించారు. విధంగా వారిద్దరి వద్ద సెల్ ఫోన్ లను, పది వేల తొంబై రూపాయాల నగదును స్వాధీనం చేసుకున్న పేర్కొన్నారు .
ఇర్ఫాన్ ఖాన్ వద్ద 0.704 కేజీ, l మహమ్మద్ యూనస్ 5-399 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ప్రోహిబిషనల్ అండ్ ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
హలో బిజినల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఇట్టి దాడులు గంజాయి నిర్మూలన లక్ష్యంగా ఇన్ఫోసిమెంట్ నిజామాబాద్ టీ ఎక్సైజ్ స్వప్న, నరసింహ చారి, హమీద్, భోజన్న, శివకుమార్, మంజుల, ఆశన్న, లక్ష్మణ్, గంగారం, రాజన్న లు పాల్గొన్నారు.
