నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు వైద్య సేవల విషయంలో నిర్వహణ లోపాలు వెక్కిరిస్తున్నాయి..
ఈ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రులను అద్భుతంగా అభివృద్ధి చేశామని పైకి చెపుతున్నా అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం శాపంగా మారింది ..
మెడికల్ కాలేజీ కి అనుబంధంగా ఉన్న ఈ ఆసుపత్రి లో అనేక సమస్యలు వెంటాడు తున్నాయి. వివాద రోగాల తో ప్రతి రోజు 2 వేలకు మంది పైగా రోగులు వస్తుంటారు .
ప్రతియేటా కోట్ల రూపాయలు వెచ్చించి పేదలకు వైద్య సేవలు అందించే ఈ సర్కారీ దవాఖాన లో గుండె సంబంధించి సమస్యల తో రోగుల విషయంలో టూడి ఇకో పరీక్ష కేంద్రం లో ఒకే యంత్రం ఉండడం గమనార్హం. .
నిజామాబాద్ జిల్లా చుట్టూ పక్క గ్రామాల నుంచి గత వారం రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో టూడి ఇకో పరీక్ష కేంద్రం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసిన, వైద్యులు లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 28 నుంచి ఒక రోగి వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చిట్టి రాయించుకొని వారం రోజులుగా వైద్యులు లేక తిరిగి ఇంటికి వెళ్ళమని ఆరోపణలున్నాయి. ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే డాక్టర్ టూడి ఇకో పరీక్ష నిర్వహిస్తున్నారు.సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఒక్క డాక్టర్ అందుబాటులో లేని సమయంలో వేరొక డాక్టర్ అందుబాటులో ఉండాలి.
కానీ ఇక్కడ వీరికి బాధ్యతలు పట్టవు.ఫిర్యాదులు పట్టించుకోరు.దీంతో అత్యవరస పరిస్థితిలో వచ్చే రోగులకు వైద్యం అందని ద్రాక్ష లాగా మారుతుంది. అలాగే సదరు వైద్యుడు లేనప్పుడు రోగుల పట్ల వైద్య సిబ్బంది కర్కశంగా వ్యవహరిస్తు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళమని చెప్పడం గమనార్హం..