తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ 2024 కు సంబంధించిన రాష్ట్రస్థాయి పోటీలు రేపటి నుంచి జనవరి 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్యర్యంలో పోటీలకు ఏర్పాట్లు చేశారు.
మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో పాటు పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ 2024 క్రీడా పోటీలను నిర్వహిస్తుంది.
నిజామాబాద్ జిల్లా హాకీ క్రీడ క్రీడాకారుల ఎంపిక విషయంలో అందుకు భిన్నంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. దేశానికి గర్వకారణమైన హాకీ క్రీడకు నిజామాబాద్ లో బీడ పడుతుందా అని క్రీడాకారులు అసోసియేషన్ సభ్యులకు అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సిఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నారు. అందుకు రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో జిల్లా క్రీడ అధికారులు స్వయంగా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లోనీ వారికి పోటలు నిర్వహించి ఈ నెల 27 నుంచి హైదరాబాద్ లోనీ ఎల్బీ స్టేడియం లో నిర్వహిస్తున్న క్రీడ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేస్తారు.
కానీ నిజామాబాద్ జిల్లా లోని హాకీ సినియర్ సెక్షన్స్ లో చాలా అవకతవకలు జరిగాయని జిల్లా క్రీడ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు.బుదవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక లో గోల్మల్ జరిగిందనీ తెలిపారు.
అసలు సెలక్షన్ కు రాని వారిని సిఎం కప్ పోటీలకు ఎంపిక చేశారని తెలిపారు. అందుకు జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కొందరు పీఈటీ లు తప్పు తోవ పట్టిస్తున్నారని క్రీడాకారులు వాపోయారు.
ఇది క్రీడలకు సరైన పద్ధతి కాదని ఈ రకమైన రాజకీయాల జోక్యం తో నిజమైన క్రీడకారులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయం పై జిల్లా డిఏఓ కు తెలపగా అంత మా ఇష్టం అన్నారని పేర్కొన్నారు.
ఇలా క్రీడాకారుల ఎంపిక విషయంలో జిల్లా అధికారులు, క్రీడాధికారులు,తీరు మార్చుకోకపోతే ఆటలు కనుమరుగవుతాయని వాపోయారు.
