HomeDevotionalనర్సింగ్ పల్లిలో వైభవంగా శ్రీవారి కల్యాణం.. మంత్రి కొండా సురేఖకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్...

నర్సింగ్ పల్లిలో వైభవంగా శ్రీవారి కల్యాణం.. మంత్రి కొండా సురేఖకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు..

జిల్లాలోని నర్సింగ్ పల్లిలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ హాజరయ్యారు.

జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రికి నిజామాబాద్ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం నర్సింగ్ పల్లిలో జరిగిన కల్యాణోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, భగవంతుని ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ మేయర్ ఆకుల సుజాత, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments