Monday, April 20, 2026
HomeTelanganaNizamabadగన్నారంలో రూ. 25 కోట్లతో అత్యాధునిక గెస్ట్ హౌస్..

గన్నారంలో రూ. 25 కోట్లతో అత్యాధునిక గెస్ట్ హౌస్..

నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రప్రాయ అంగీకారం..నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..గన్నారం ప్రాంతంలో రూ. 25 కోట్ల భారీ వ్యయంతో అత్యాధునిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.

సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించగా, గన్నారంలో గెస్ట్ హౌస్ నిర్మాణ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.

గన్నారం ప్రాంతంలో ఒక ఎకరా భూమిలో అన్ని హంగులతో ఈ గెస్ట్ హౌస్‌ను నిర్మించనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాకు వచ్చే ఉన్నతాధికారులు, ప్రముఖుల వసతి సౌకర్యార్థం ఈ భవనం ఎంతగానో దోహదపడనుంది.

అలాగే జిల్లా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని చేపట్టాలని నాయకులు కోరారు. రెండో దశ అభివృద్ధి పనుల్లో భాగంగా ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారనీ అన్నారు.

జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిధుల మంజూరులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని సీఎం భరోసా ఇచ్చినట్లు నేతలు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!