కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మదీన కాలానికి చెందిన ఫజీయా అనే ఐదేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.
బాలిక తండ్రి షేక్ అక్తర్ స్థానికులను తీసుకుని వెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ధర్నా సమయంలో అక్కడ మున్సిపల్ ఛైర్ పర్సన్, కమిషనర్ లేరని ఆయన పేర్కొన్నారు.
ఈ వీధి కుక్కల విషయంలో మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని కుక్కల బెడద తప్పించాలని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
