మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటైన చెక్ పోస్టు ను ఇసుక మాఫియా నిప్పుపెట్టింది. పొతంగల్ మండలం కొడిచర్ల లో ఉన్న ఈ చెక్ పోస్టు లో ఎవరు లేకపోవడం తో ముప్పు తప్పినట్లు అయింది.
దొంగ్లీ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడి నట్లుగా అనుమానిస్తున్నారు.చెక్ పోస్టు లో ఎవరు విధుల్లో జిల్లాలేకపోవడం వల్లే ఇసుక మాఫియా తెగబడింది.మంజీరా నది నుంచి ఇసుక ను గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటి మహారాష్ట్ర ప్రాంతాలకు తరలిస్తారు ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ఈ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు
పొతంగల్ మండలంలోని పొతంగల్ కొడిచెర్ల ,సుంకిని శివారులలో ఈ చెక్ పోస్టుల ఏర్పాటు చేసారు. ఇది ఇసుక మాఫియా జీర్ణించుకోలేక పోయింది చెక్ పోస్ట్ ల వల్ల మంజీరా నుంచి ఇసుకను మహారాష్ట్రకు తరలించడం దుసాధ్యం అయింది ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పోతంగల్ మండలం కొడిచెర్ల శివారులోని చెక్ పోస్ట్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు చెక్ పోస్ట్ కోసం ఏర్పాటుచేసిన గుడిసెకు నిప్పు పెట్టడం తీవ్ర కలకలం రేపుతుంది ఇది ఇసుక మాఫియా బరితెగింపుకు నిదర్శనంగా చెప్తున్నారు
డోంగ్లి మండలం సిర్పూర్ కు చెందిన ఇసుక మాఫియా నే తో పాటు స్థానికంగా ఉన్న నేతల అండదండలతో చెక్ పోస్ట్ కు నిప్పు పెట్టారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ విధులలో ఉన్న సిబ్బంది అక్కడే గుడిసెలో ఉండి ఉంటే అనర్థం జరిగి ఉండేదనే ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతుంది
