HomeCRIMEమేయర్ భర్త దాడి కేసులో నిందుతుడు రిమాండ్....

మేయర్ భర్త దాడి కేసులో నిందుతుడు రిమాండ్….

నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనలో నిందితుని రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్ళితే నాగారం లోని 80 క్వార్టర్స్ కు చెందిన షేక్ రసూల్ వాళ్ళ అమ్మ పేరు మీద 2005 వ సంవత్సరంలో నాగారంలోని 80 క్వార్టర్స్ లో 75 గజాల సంబంధించి రెండు ప్లాట్లు ప్రభుత్వం అప్పట్లో ఇచ్చింది.

ఒక ప్లాట్ లో చిన్నగా ఇల్లు కట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క నివాసం ఉంటున్నారు. మరొక ప్లాట్ విషయంలో సుమారు మూడు సంవత్సరాల నుంచి బాధితుడు, దండు శేఖర్ యొక్క అనుచరులు అయిన గోపాల్, తిరుపతి లతో ప్లాట్ విషయంలో గొడవలు జరిగినవి.

ఈ విషయంలో దాదాపు సంవత్సరం క్రితం నిందితుడు బాదితుడి ఆఫీస్ కు వెళ్లి, ఫ్లాట్ విషయం సెటిల్ చేయమని అడుగగా సెటిల్ కాలేదు.

ఇదే విషయం లోపల నిందితుడు చాలాసార్లు బాధితుడుతో మరియు గోపాల్, తిరుపతి లతో నా ప్లాటు విషయంలో మాట్లాడి తను ఇల్లు కట్టుకుంటానని ప్లాటు విషయంలో అడ్డురావద్దని చెప్పుకున్న కూడా గోపాల్ మరియు తిరుపతి అలాగే బాధితుడు నిందితుడిని ప్లాట్ విషయంలో సహాయం చేయకుండా బెదిరించినట్లు తెలిపారు.

ఇదే విషయంలో నాగారం పోలీస్ స్టేషన్ నందు 2021లో నిందితుడు తిరుపతి మరియు ఇతరులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ విషయంలో నిందితుడు మానసికంగా కృంగిపోయి ఎలాగైనా గోపాల్ ను మరియు బాధితులను చంపితే ప్లాటు విషయంలో అడ్డురారని భావించి చంపాలన్న ఉద్దేశంతోనే సోమవారం సాయంత్రం తన భార్య పిల్లలతో నిందితుడు గోపాలు మరియు శేఖర్లను చంపేస్తానని చెప్పి వారిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిలోకి పంపించాడు.

సాయంత్రం 5:30 గంటల సమయంలో నిందితుడు గోపాల్ మీద దాడి చేయడానికి ప్రయత్నించగా, గోపాల్ దొరకకపోగా బాధితుడు శేకర్ మున్సిపల్ ఆఫీసర్లు ఇద్దరితో సిసి రోడ్ విషయం లోపల ఇన్స్పెక్షన్ చేస్తుండగా అది గమనించిన నిందితుడు, బాధితుని వద్దకు వెళ్లి నా ఫ్లాట్ కబ్జా చేస్తారా అని బాధితున్ని చేతితో కొట్టి కిందపడేసి కాళ్లతో తన్ని ఆటోలో ఉన్న సుత్తి తీసుకొని విచక్షణ రహితంగా కొట్టాడు.

దీనితో శేఖర్ అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. ఇట్టి సంఘటన అంతా కూడా తన ఫోన్లో వెల్డింగ్ అహ్మద్ అను వ్యక్తి సహాయంతో చిత్రీకరింపచేసి ఒక సెల్ఫీ వీడియో కూడా తన ఫోన్లో తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేసినాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకుని విచారించారు.మంగళవారం సాయంత్రం నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి రాజా వెంకటరెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments