నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ బంగారం చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. నిజాంసాగర్ మండలం జక్కాపూర్ కు చెందిన ఓ మహిళ కాన్పు కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
డెలీవరీ కోసం ఆపరేషన్ థియేటర్ కు వెళ్లే ముందు మహిళ తన రెండు గ్రాముల బంగారు ఆభరణాలను తీసి పక్కన పెట్టినట్లు తెలిసింది. సర్జరీ అనంతరం వచ్చి చూడగా బంగారు ఆభరణాలను కనిపించలేదు.
దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
