ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయ్యాక సుదర్శన్ రెడ్డి మొదటిగా సారిగా జిల్లాకు వస్తున్నారు.
మంత్రి పదవి కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఆయన కు నిరాశే ఎదురయ్యింది కానీ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోని క్యాబినెట్ మంత్రి స్థాయి ఉన్న సలహాదారుడు పదవి కట్టబెట్టారు.
ఏకంగా మంత్రి మండలి సమావేశాల్లోనూ పాల్గొనేలా ఉత్తర్వ్యూలు ఇచ్చారు. అందులోను ఆరు గ్యారెంటీ పథకాల అమలు పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు. సీఎం బుజ్జగింపు తో మెత్తబడ్డ సుదర్శన్ రెడ్డి మూడు రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు.
నిజానికి పార్టీ అధికారం కోల్పోయిన పదేళ్ల కాలం లో జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. కార్యకర్తల కు అండగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ వర్గాల్లో బలమైన స్థానం ఉంది.
క్లిన్ ఇమేజ్ ఉన్న ఆయన కు మొదటి దఫాలోనే మంత్రి అవుతారని అంతా భావించారు. అందుకే సుదర్శన్ రెడ్డి సైతం పార్టీ పాలనా వ్యవహారాలకు అంటి ముట్టనట్లుగా వుంటూ వస్తున్నారు కానీ సలహాదారుడి గా నియామకం కావడంతో ఆయన మరోసారి క్రియాశీలం కానున్నారు.
గురువారం నిజామాబాద్ వస్తున్న ఆయన కు భారీ ఎత్తున స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి.
మాధవ్ నగర్ సాయి బాబా మందిరం నుండి బైక్ ర్యాలీ మధ్యాహ్నం 1 అమలకు ప్రారంభం అవుతుంది.
అక్కడి నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది.
జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యక్రతబిందులో పాల్గొని సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
