నగరంలోని గాజులపేటలో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే ఖాజా మొహీనుద్దీన్ (60) జీవితంపై విరక్తి చెందడంతో కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి (GGH) తరలించారు.
ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
