అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన నవిపేట్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే…నవిపేట్ కు చెందిన కొలస సంజీవ్(49).
శనివారం రాత్రి మద్యం సేవించడానికి స్నేహితులతో కలిసి వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
ఆదివారం ఉదయం నవీపేట రెంజల్ రోడ్డు కల్వర్టు లో పడి మృతి చెందినట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడా? లేక మద్యం మత్తులో పడి మృతి చెందాడ? అనే కోణంలో పోలీసులుసు విచారణ జరుపుతున్నారు.
