ఆర్మూర్ కస్తూరి భా విద్యా సంస్థలో ఓ విద్యార్థి అనుమాన స్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.ఆర్మూర్ మూడు రోజుల క్రింతం విద్యార్థికి జరగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి బుధవారం మరణించింది.
సోమవారం హస్టల్ లో అందరితో పాటు నిద్రపోయిన విద్యార్థిని తెల్లవారుజామున ఇతర విద్యార్థుల గదులకు గొళ్ళం పెట్టి హస్టల్ నుండి బయటికి వెళ్లే ప్రయత్నం లో హాస్టల్ గోడ మిదీ నుంచి కిందకు దూకింది.
ఈప్రమాదం లో ఆమె కాలు విరగడం తో పాటు తలకు బలమైన దెబ్బ తగిలి అపస్మార స్థితి లో పడింది. ల్యాబ్ లో నిద్రిస్తున్న వార్డెన్ తో పాటు మిగతా విద్యార్థినిలు సంఘటన స్థలానికి వెళ్లారు.
హుటహుటిన ఆర్మూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమించిందని వైద్యలు తెలపడంతో అక్కడి నుండి నిజామాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
రెండురోజుల చికిత్స అనంతరం బుధవారం విద్యార్థిని బ్లడ్ క్లాట్స్ ఏక్కువగా ఉండటంతో మరణించింది. మృతురాలు ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది.
నిజామాబాద్ నగరంలో లోని దుబ్బ ప్రాంతంలో వుంటున్నారు ఆమె తండ్రి గంజ్ లో పనిచేస్తున్నారు. కానీ కోతులు వెంట బడడం వల్లే ఈ ఘటన జరిగిందని హాస్టల్ నిర్వాహకులు చెప్తున్నారు.
