HomeCRIMEఇసుక క్వారీ గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ ........మంజీరా లో ఇసుక తవ్వకాలు చేస్తున్న...

ఇసుక క్వారీ గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ ……..మంజీరా లో ఇసుక తవ్వకాలు చేస్తున్న మూడు జెసిబి ……రవాణా పది వాహనాలు …….అవాక్కు అయినా అధికారులు ……..

టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇసుక అక్రమ తవ్వకాలు రవాణా ల గుట్టు రట్టు చేసారు. బోధన్ మండలం మందర్న గ్రామ శివారు లో మంజీరా పరివాహకం నుంచి జేసీబీ లతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని పక్క సమాచారం అందడంతో సీఐ అంజయ్య ఎస్సై గోవింద్ లు సోమవారం అర్ధ రాత్రి మెరుపు దాడి చేసారు.

వారు వెళ్లే సమయానికే ఇసుక అక్రమ రవాణా కు టిప్పర్లు బారులు తీరాయి. ఏకంగా మూడు జెసిబి లతో ఇసుక లోడింగ్ సాగుతుంది. దాదాపు 9 టిప్పర్ల టెర్రస్ లారీ లు ఇసుక తరలించడానికి సిద్ధంగా వుంచారు.

జేసీబీ టిప్పర్లతో పాటు 12 డ్రైవర్ల అదుపు లోకి తీసుకున్నారు తదుపరి దర్యాప్తు కోసం బోధన్ రూరల్ పోలీసులకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణా జరగొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కమిషనర్ సైతం బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఇసుక విషయంలో కఠినంగా ఉండాలని హెచ్చరించారు. అయినప్పటికీ మంజీరా నదిలో ఇసుక తోడేళ్ళు వ్యవహారం టాస్క్ ఫోర్స్ వెలుగులోకి తెచ్చింది. ఇద్దరు కానిస్టేబుళ్లే ఇసుక స్మగ్లర్ల తో అంటకాగి తవ్వకాలు సాగిస్తున్నారు.

ఈపాటికే ఆయా ప్రభుత్వ పథకాల కోసం పరిమితం అయిన అనుమతులతో ఇసుక పర్మిట్ లు జారీచేశారు కానీ పర్మిట్ల ముసుగులోని యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు అక్రమ రవాణా సాగిస్తున్నారు.

అసలు జిల్లాలో ఇసుక అక్రమ రావణే జరగొద్దని కమిషనర్ హెచ్చరించారు అయినప్పటికి ఇసుక దందా యథేచ్ఛగా సాగుతుండడంతో సీపీ టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. ఎట్టకేలకు వారు బోధన్ లో భారీ ఇసుక క్వారీ గుట్టు చేసారు.

ఈ క్వారీ నుంచి రోజు రాత్రి 30 నుంచి టిప్పర్ల మేరకు ఇసుక ను గుట్టుగా తరలిస్తున్నారని టాస్క్ ఫోర్స్ ప్రాథమిక విచారణ లో తేలింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments