రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వోట్ల లెక్కింపు పక్రియ ఇంకా సాగుతూనే ఉంది సోమవారం అర్ధ రాత్రి దాటాకే టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ పక్రియ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తీ అయ్యే దాక బీజేపీ అభ్యర్థి స్పష్టమైన మెజార్టీ తో కొనసాగుతున్నారు.
మరో వైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ సెగ్మెంట్ కు సంబంధించి వోట్ల లెక్కింపు పక్రియ ఇంకా ప్రాథమిక స్థాయిలో సాగుతుంది. రాత్రి ఏడుగంటల దాక చెల్లని ఓట్లను వేరు చేయడం పూర్తీ అయింది. అర్ద రాత్రి దాటినా తర్వాతే వోట్ల లెక్కింపు మొదలు కానుంది. తుది ఫలితం మాత్రం మంగళవారం అర్ద రాత్రే వెలుబడే ఛాన్స్ ఉంది
