ప్రపంచంలోనే అత్యధిక కాంటాక్ట్ నంబర్ సేవర్ గా అసాధారణ నైపుణ్యం, అంకితభావంతో కొత్తకొండ శక్తి ప్రసాద్ ప్రపంచ రికార్డు సాధించారు.
ఇది సంగతి దినపత్రికలో రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న కొత్తకొండ శక్తి ప్రసాద్ ప్రపంచంలోనే అత్యధిక కాంటాక్ట్ నంబర్ సేవర్‌గా గుర్తింపు పొంది లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఈ అరుదైన ఫీట్ అతని నెట్వర్కింగ్ నైపుణ్యానికి, సాంకేతిక నైపుణ్యానికి మరియు అత్యుత్తమ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. సాధారణ పని కూడా అసాధారణ విజయానికి దారితీస్తుందని అతను నిరూపించాడు.
ఈ అద్భుతమైన విజయానికి ఇది సంగతి యాజమాన్యం హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
