నిజామాబాద్ జిల్లాఆర్మూర్ ప్రాంతం లో కులసంఘాల దాష్టికాలు ఆగడం లేదు తండ్రి అంతక్రియలకు వెళ్లకుండా కొడుకు నే కట్టడి చేసిన వైనం వేల్పుర్ మండలం పచ్చల నడుకూడా లో వెలుగు చూసింది.చివరికి తన గోడు పోలీసుల కు వెళ్లబోసుకోవడంతో వారు రక్షణలో అంతక్రియల్లో పాల్గొన్నాడు.
అంతకు ముందు చిన్న కొడుకు వద్ద ఉన్న తండ్రి మృతదేహం ను సైతం లాక్కొని పెద్ద కొడుకు ఇంటికి చేర్చారు. గతంలో కమిషనర్ గా పనిచేసిన కల్మేశ్వర్ కర్కశంగా కుల సంఘాలను వేటాడాడుకానీ ఆయన బదిలీ అయ్యాక మళ్ళీ కులసంఘాలు చెలరేగుతున్నాయి.
వేల్పూర్ మండలం పచ్చల నడుకడలో లింగన్న అనే దంపతులనుఆస్థి తగాదా వివాదంలో కులం నుంచి బహిష్కరణ చేశారు దీనితో ఆయన ఇద్దరు కొడుకులు సైతం వేరు పడ్డారు కుల సంగం ఆదేశాల మేరకు ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులను సైతం కలవడానికి బయపడేది ఒకటి రెండు సార్లు చిన్నకొడుకు వెళ్తే జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.ఆదివారం లింగన్న చనిపోవడంతో అంత్య క్రియలకు ముందుకు వచ్చిన చిన్నకొడుకు మృత దేహం ను తన ఇంటికి తెచ్చుకున్నాడు .
విషయం తెల్సిన కుల సంఘం పెద్దలు వెళ్లి చిన్నకొడుకు ను తీవ్రంగా మందలించారు తండ్రి ని వెలివేశామని అతని అంతక్రియలకు తమ అనుమతి ఎందుకు తీసుకోలేదని నిలదీశారు వెంటనే మృతదేహం ను ఉన్నపలంగా పెద్ద కొడుకు ఇంటికి షిఫ్ట్ చేశారు అంతక్రియలకు అనుమతి లేదని తెగేసి చెప్పారు దీంతో బాధితుడు ఆదివారం రాత్రి వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
సంఘం నిబంధనలను ఒప్పుకుని, చెప్పిన జరిమానా కట్టినందుకు పెద్ద కొడుకుకు అంత్య క్రియలు చేసేందుకు అనుమతించారు. దీంతో బాధితుడు తన తల్లి, భార్యతో కలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు.
కులసంఘం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సంఘం నియమాలు తప్పినందుకు జరిమానా కింద 8 వేల రూపాయలు వసూలు చేశారని పోలీసులకు తెలిపాడు. ‘‘సంఘం నియమాలకు అనుగుణంగా మీ అన్న జరిమానా చెల్లించాడు. చెప్పినట్లు వింటున్నాడు..
అంత్య క్రియలు చేసేందుకు మీ అన్నకు హక్కు ఉంది నీకు లేదు’’ అని బెదిరించారని పోలీసులతో వాపోయాడు దీనితో పోలీసులు రంగంలోకి దిగి సోమవారం తండ్రి అంతక్రియల్లో కొడుకు పాల్గొనేలా రక్షణ కల్పించారు
