HomeCRIMEఒక్కో డాక్యుమెంట్ కు పది వేలు .....నిర్మల్ కేంద్రంగా సాగినా సబ్ రిజిస్టార్ వసూళ్ల దందా...

ఒక్కో డాక్యుమెంట్ కు పది వేలు …..నిర్మల్ కేంద్రంగా సాగినా సబ్ రిజిస్టార్ వసూళ్ల దందా …….వసూళ్ల కోసం ఇద్దరు ప్రైవేట్ సహాయకులు ……..ఏసీబీ దాడి తో వసూళ్ల గుట్టు రట్టు

పర్సెంటేజి ల విషయంలో ఆనవాయితీ చెత్తబుట్టలో వేయండి నా వద్ద ఎలాంటి రిజిస్ట్రేషన్ అయినా సరే ఒక్కో దస్తావేజా పది వేల రూపాయలు ఇవ్వాల్సిందే …..లేదా అది ఎలాంటి డాక్యుమెంట్ అయినా సరే నా టేబుల్ దాటి ముందుకు వెళ్ళదు ఇది బదిలీ ఫై నిజామాబాద్ సబ్ రిజిస్టార్ గా రామరాజు వచ్చిన తొలి రోజుల్లో తెగేసి చెప్పిన మాటలు ఎహే ఇవ్వన్నీ ఉత్తి ధమ్కీ లే కావచ్చు కొద్దీ రోజులు పొతే అంతా సర్దుకుంటుందని రైటర్లు భావించారు.

కానీ ఆయన మొదట్లో అన్న మాటలకే కట్టుబడి ఉన్నారు అసలు డాక్యుమెంట్ రైటర్ లకు తన దరి దాపుల్లోకి రానివ్వలేదు నేరుగా రిజిస్ట్రేషన్ చేయలని వచ్చే వారితో పది వేలరూపాయలు ముక్కుపిండి వసూలు చేసాడు. డాక్యమెంట్ తయారీ కూడా ఆయనే స్వయంగా అదికూడా నిర్మల్ లో తయారు చేసి తెచ్చేది ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు నమ్మకస్తులం సహాయకులుగా ఆఫీస్ లో మకాం వేయించి రిజిస్ట్రేషన్ కు వచ్చే వారు ఇచ్చే నగదు ను వసూలు చేసేది. సదరు రిజిస్టార్ సాగిస్తున్న వసూళ్ల దందా తో స్థానిక డాక్యుమెంట్ రైటర్ లు రగిలి పోయారు.

ఇదివరకు పనిచేసిన అధికారులు ఒక్కో డాక్యుమెంట్ కు రెండు నుంచి మూడు వేలు అడిగే వారని కానీ ఇప్పుడు పది వేలు డిమాండ్ చేయడం ఫై వారంతా జిల్లా రిజిస్టార్ కు డిఐజి లకు పిర్యాదు చేశారు ప్రజాప్రతినిధులకు మోర పెట్టుకున్నారు అయినా పది వేల విషయంలో సబ్ రిజిస్టార్ వెనక్కి తగ్గలేదు. దీనితో ఆందోళనకు దిగారు అయినా నో యాక్షన్ ! ఎందుకంటే ఉన్నతాధికారులు గుడ్డిగా సబ్ రిజిస్టార్లకు అండగా గా నిలిచారు.

తమ వాటాలు కూడా రెండింతలు అవుతుండడంతో వారంతా సైలెంట్ అయ్యారు ఇంకేముంది సబ్ రిజిస్టర్లు వసూళ్ల కోసం ఎగబడ్డారు. ఏరియా ఏదైనా అక్కడి మార్కెట్ ధర ఎంత ఉన్నాసరే …..అసలు ఎలాంటి రిజిస్ట్రేషన్ అయినా సరే దాని విలువ ఎంత తక్కువగాఉన్న సరే తమ వద్దకు వచ్చే డాక్యుమెంట్ కు అధికార ముద్ర పడాలంటే పది వేల రూపాయలు తమ వాటాగా ఇవ్వాల్సిందే.

వసూళ్ల కోసం ఒక్కో సబ్ రిజిస్టార్ కు ఒక్కో సహాయకుడు ఆఫీస్ ఏరియా లోనే అందుబాటులో ఉండేలా చేసుకున్నారు. అంతే కాదు సబ్ రిజిస్టార్లే డాక్యమెంట్ రైటర్లుగా అవతారం ఎత్తారు. నిర్మల్ లోనే ఈ డాక్యుమెంట్ లను తయారు చేసి తెచ్చి వాటిని ఎక్కడి చెలామణి చేస్తూ వచ్చారు.

పది ఇవ్వడానికి ససేమిరా అన్నారో చిన్న సాంకేతిక కొర్రీలు వేసి ఆ డాక్యమెంట్ లను పక్కకు పడేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదంటూ తెగేసి చెప్తున్నారు ఎలాగో పిర్యాదు లు చేసి అలిసి పోయిన స్థానిక రైటర్లు తమ దందా లను వదులు కునే దాక వచ్చారు. ఓ బాధితుడు ఓ మోటేషన్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే పది వేల డిమాండ్ విషయం తెల్సి విస్తు బోయాడు. పది వేలు ఇవ్వడానికి రిజిస్టార్ రామరాజు తో డీల్ సెట్ చేసుకున్నాడు.

ఆ తర్వాత నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారు సోమవారం ఉదయమే రంగంలోకి దిగారు బాధితుడి వెంటే ఆఫీస్ కు వచ్చి రామరాజు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ వ్యక్తి వెంకట్ రావు కు పది వేలు ఇవ్వగన్ పట్టుకొని అతని ద్వార రామరాజు ను పట్టుకున్నారు.

ఏసీబీ దాడి తో మొత్తానికి గత ఎనిమిది మాసాలుగా సబ్ రిజిస్టార్ నిర్మల్ కేంద్రంగా సాగిస్తున్న వసూళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇంతకి రామరాజు రోజువారీగా బరితెగించి చేస్తున్న వసూళ్ల ల్లో ఎవరెవరికి ఎంత ముట్టజెప్పేది ఏసీబీ తేల్చాలి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments