HomeCRIMEవిద్యార్థిని చితకబాదిన టీచర్ కు తాఖీదు... టీచర్ బదిలీకి విద్యా శాఖ రంగం సిద్ధం..

విద్యార్థిని చితకబాదిన టీచర్ కు తాఖీదు… టీచర్ బదిలీకి విద్యా శాఖ రంగం సిద్ధం..

జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని టీచర్ చితకబాదారు. విద్యార్థిని తల్లిదండ్రులు టీచర్ కల్పన పై స్థానిక మూడవ ఠాణా లో కేసు ఫిర్యాదు చేయగా పోలీసేసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.వివరాల్లోకి వెళ్లితే.. నగరంగౌతమ్ నగర్ కు చెందిన అశ్విత. దుబ్బా ప్రాంతంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది.

ఈ మేరకు మూడు రోజుల క్రితం విద్యార్థిని అశ్విత తలనొప్పిగా ఉందని పాఠశాల ఉపాధ్యాయురాలైన కల్పనాకు చెప్పి ఇంటికి వెళ్ళింది.మరుసటి రోజు ఉదయం యధావిధిగా స్కూలుకు వెళ్లిన అశ్వితకు ఉపాధ్యాయునిరాలైన కల్పన గణిత శాస్త్రం లో స్లీప్ టెస్ట్ పెట్టింది.

అందుకు విద్యార్థిని అశ్విత అందరి విద్యార్థిని లాగానే స్లిప్ టెస్ట్ రాస్తూ ఉండగా టీచర్ కల్పన విద్యార్థినినీ పిలిచి నీవు స్కూలుకే సరిగా రావావు బయట తిరగడానికి వెళ్తావు అని దుర్భాషలతో విద్యార్థిని కర్రతో చితకబాదింది.

అనంతరం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత విద్యార్థినిని చూడగా ఒంటిపై తీవ్ర వాతలతో ఉన్నాయని తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యార్థిని తీసుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్ళగా చేతు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.

తల్లిదండ్రులు విద్య శాఖ అధికారులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన డీఈఓ, ఎంఇఓ లు పట్టించుకోకపోవడంతో సోమవారం జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు.విషయం తెలుసుకున్న కలెక్టర్ విద్యాశాఖ అధికారులపై మండిపడ్డారు. విద్యార్థిని కొట్టిన టీచర్ కు తకిదు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. టీచర్ కల్పన కు మేమో ఇవ్వడానికి విద్యాశాఖ రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments