తెలంగాణ లో అధికారంలో కి రావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తుందంటు జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. సుదీర్ఘ కసరత్తుల తరవాత బీజేపీ జాతీయ కార్యవర్గంను ప్రకటించింది.దిగ్గజ నేతలున్న తెలంగాణ నుంచి ఒక్కరికి అవకాశం దక్కలేదు.
సీఎం రేసులో అరడజన్ మంది నేతలున్నా సరే ఏ ఒక్కరికి జాతీయ పార్టీలో చోటు దక్కలేదు మొన్నటి కార్యవర్గం లో మహాబునగర్ జిల్లాకు చెందిన ఎంపీ డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలి గా వుండే కానీ ఈసారి ఆమెకు చుక్కెదురైంది.
అర్వింద్ ఈటెల లాంటి డైనమిక్ లీడర్ల కు పార్టీలో క్రియాశీల పాత్ర వుండేలా జాతీయ నాయకత్వం ప్లాన్ చేస్తుందని భావించారు గతంలో బీజేపీ స్టేట్ చీఫ్ నుంచి తప్పించిన బండి సంజయ్ ప్రధాన కార్యదర్శి గా అవకాశం ఇచ్చారు.
కానీ ఈసారి నితిన్ నబి తన టీం లో తెలంగాణ నేతలెవ్వరికి అవకాశం ఇవ్వలేదు గత పది రోజుల ముందే తెలంగాణ ముఖ్య నేతలతో నబీ కీలక సమావేశం నిర్వహించి అధికారమే లక్ష్యంగా పనిచెయ్యాలని దిశానిర్దేశం చేసారు.
తాను ఇక నుంచి మూడు నెలల ఒక సారి రివ్యూ చేస్తానని చెప్పారు దీనితో క్యాడర్ లో జోష్ వచ్చింది ఓహో తెలంగాణ లో పార్టీకి మంచి రోజులొచ్చాయని సంబర పడ్డారు కానీ పది రోజులకే తుస్స్ మనిపించారు.సొంత బలం తో తెలంగాణలో అధికారం దక్కదని ఆలోచనకు అగ్ర నాయకత్వం వచ్చింది మీద పూర్తిగా ఆశలు వదులుకున్న కేంద్ర బీజేపీ.
తెలంగాణ కు ప్రాధాన్యత ఇవ్వలేదు అదే ఏపీ లో సొంత గా అధికారంలో కి వచ్చే ఛాన్స్ దరిదాపుల్లో లేక పోయిన ఇద్దరు నేతలకు పదవులు కట్టబెట్టింది పురందేశ్వరి కి ఉపాధ్యక్షురాలు గా నియమించారు.
ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఏపీ నుండి విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కానీ గతంలో తెలంగాణ నుండి ముగ్గురు నాయకులకు కీలక పోస్టులు ఇచ్చిన జాతీయ నాయకత్వం ఉండగా, ఈసారి ఒక్కరి కి ఛాన్స్ ఇవ్వలేక పోయింది
13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు..8 మందికి ప్రధాన కార్యదర్శి మరో ఇద్దరి సహాయ కార్యదర్శి పదవులు ప్రకటించారు
