ఆషాడ మాసం వచ్చే లోపే మంత్రి వర్గం విస్తరించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తుంది. విస్తరణ కు ఈ నెల 4 న ముహూర్తం ఖరారు చేసారని సమాచారం. .
ఈసారి విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దాదాపు ఖరారు అయింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి క్యాబినెట్ లో బెర్ట్ కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
లోకసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవీ విషయంలో భిన్నవాదనలు తెరమీదికి వచ్చాయి. లోకసభ ఎన్నికల ఇంచార్జ్ నియమించిన అధిష్టానం ఆయన కే గెలుపు బాధ్యతలు అప్పగించారు.
అయినప్పటికి సానుకూల ఫలితాలు రాలేదు. దీనితో ఫలితాల ప్రభావం మంత్రి పదవీ అవకాశాల దెబ్బతీస్తాయనే ఆందోళన సుదర్శన్ రెడ్డి వర్గీయుల్లో ఆందోళన వ్యక్తం అయింది.
కానీ సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో పట్టు బట్టారని సమాచారం.
ఈ మేరకు ఆయన వర్గీయులు సంబర పడుతున్నారు. మంత్రి పదవీ కి భరోసా దొరకడంతో పాటు ఆయన కు హోం శాఖ దక్కబోతుందని ప్రచారం చేస్తున్నారు.